వారాహికి ఎదురులేదు-పవన్ కళ్యాణ్ కు తిరుగు లేదు

  • పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరణలో పిఠాపురం ఇంచార్జ్ మాకినీడి శేషుకుమారి..!

పిఠాపురం రూరల్ మండలం జనసేన పార్టీ అధ్యక్షుడు గోపు సురేష్ అధ్యక్షతన భారీ ఎత్తున బైక్ ర్యాలీ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర విజయవంతం చేయాలని కోరుతూ కుమారపురం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గ మాత ఆలయముకు వెళ్లి అమ్మవారి ఆశీస్సులు వారాహిపై ఉండాలని ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిఠాపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ మాకినీడి శేషుకుమారి హాజరై వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకునేందుకుగాను చేపట్టిన ఈ యాత్ర 16వ తేదీ పిఠాపురం రానున్న సందర్భంలో అధిక సంఖ్యలో జనసైనికులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని వారాహి యాత్రను జయప్రదం చేయాలని శేషుకుమారి విజ్ఞప్తి చేశారు. అధికారంలో ఉన్న వైకాపా పార్టీకి వారహి గుబులు పట్టిందని దాని నుంచి బయట పడేందుకుగాను వారాహి యాత్రను అడ్డుకునేందుకుగాను పోలీసులను అడ్డంపెట్టుకుని సెక్షన్ 30 పోలీస్ ఆక్ట్ అమలు పరచడం వైకాపా ప్రభుత్వ పిరికితానాన్ని స్పష్టం చేస్తుందని. అధికార ప్రభుత్వం ఇన్ని కుట్రలు పన్నాగాలు పన్నిన పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను మాత్రం అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని రానున్న రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఇదే హవా కొనసాగిస్తారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో గొల్లప్రోలు మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, మహిళా ప్రెసిడెంట్ కోలా దర్గా, కేతినిడి గౌరీ నాగలక్ష్మి, పి.ఎస్.ఎన్ మూర్తి, మాదేపల్లి పద్మరాజు, రౌతు శివ బాబు, యండ్రపు శ్రీనివాస్, కాళ్ల రాజు, ఎంపీటీసీ బేశెట్టి ఉమా మహేష్, మేళం రామకృష్ణ, దువ్వ వీరబాబు, కట్ట బంగారు రాజు, బెల్లం శ్రీనివాస్, గల్లా వీర కృష్ణ, తుమ్మలపల్లి అనంతయ్య, పెనుగొండ సోమేశ్వరరావు, గారపాటి శివకొండ రావు, గొల్లపల్లి గంగ, పెనుగొండ వెంకటేశ్వరరావు, దేశరెడ్డి సతీష్, కంద సోమరాజు, మచ్చ అప్పారావు, నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.