ఏపిలో చీకటి పాలన నడుస్తుంది అనటానికి జీవో నెంబర్ 1 నిదర్శనం: గాదె

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ లో చీకటి పాలన నడుస్తుంది అనటానికి జీవో నెంబర్ 1 నిదర్శనమని జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం జీవో నెంబర్ 1ని నిరసిస్తూ జిల్లాలో జనసేన శ్రేణులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 1 రాజకీయ పార్టీలను, ప్రజాసంఘాలను కట్టడచేయాలని ఉద్దేశంతో జారీ చేసినదే కానీ ప్రజలను ఉద్ధరించడానికి చేశాం అని చెప్పుకోవటానికి ప్రభుత్వానికి సిగ్గు ఉండాలని ఎద్దేవా చేసారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఎంతో ఉన్నతమైన చదువు చదివిన వారికే అన్ని అర్హతలు కలిగిన వారే ఆఫీసర్స్ గా ఉంటారు. అలాంటిది ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ పైన కూడా సలహాదారులను పెట్టడం అంటే ఎంతటి సిగ్గుచేటో అధికారపార్టీ నాయకులు తెలుసుకోవాలి. ఇలాంటి పనికిమాలిన సలహాదారులను పెట్టడం వలనే ఇలాంటి పనికిమాలిన జీవోలను తెస్తున్నారు. ఈ జీవోలో 1861 పోలీస్ యాక్ట్ ని కోడ్ చేశారు. ఈ యాక్ట్ ప్రకారం పోలీసులు విధులను ఎలా చేయాలో చెప్తున్నది కానీ రాజకీయ పార్టీలను ఏ విధంగా మీటింగ్స్ పెట్టుకోవాలో హైవేలపైనా, గ్రామీణ ప్రాంతాల లో సభలు పెట్టకూడదు అని ఎక్కడా లేదు. జగన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీకి చక్కగా వెళ్ళినట్లయితే అన్నీ తెలిసి ఉండేవి కానీ మా అయ్య చనిపోయాడు అని వంకతో నువ్వు హైవేలపైన, గ్రామీణ ప్రాంతాలలో సభలు పెట్టుకుని ముఖ్యమంత్రి అయ్యావు అని గుర్తుపెట్టుకో. ఆనాడు అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కూడా నిన్ను ఇలానే రోడ్లపై తిరగనివ్వకుండా చేసి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రివి అయ్యేవాడివే కాదు. ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని ఇలాంటి పనికిమాలిన జీవోలను జారీ చేయకుండా ఉంటావని చేసిన వాటిని వెంటనే వెనక్కు తీసుకోవాలని హెచ్చరిస్తున్నాం. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని అసెంబ్లీని ముట్టడి చేయటానికి వెనుకాడమని గాదే హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అడపా మాణిక్యాలరావు, నారదాసు రామచంద్ర ప్రసాద్, పార్వతీ నాయుడు, త్రినాద్, నగర అధ్యక్షులు నేరెళ్ల సురేష్, మండల అధ్యక్షులు గంధం సురేష్, శ్రీరాములు, నరేష్, వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు యర్రంశెట్టి పద్మ, దాసరి లక్ష్మి, నగర కమిటీ సభ్యులు, నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.