ఏపీలో మంత్రి రోజా దుకాణం మూత పడే సమయం ఆసన్నమైంది: దారం అనిత

మదనపల్లి: ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటక శాఖ మంత్రి రోజా దుకాణం మూత పడే సమయం ఆసన్నమైందని జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రిగా ఉన్న రోజా మెగా ఫ్యామిలీని దూషించడం అనేది యావత్ రాష్ట్రం తిప్పి కొడుతోంది. ఒక మంత్రి స్థాయిలో ఉన్న రోజా మాటలు ను యావత్ మెగా అభిమానులు ఖండిస్తున్నారు. రోజా గారు పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి నేటి వరకూ పర్యటనలు చేయడం తప్ప పర్యాటక శాఖ అభివృద్ధికి చేసింది ఏమీ లేదు. అలాంటి ఆమె 2012 నుండి 2014 వరకు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న చిరంజీవి గారి హయాంలో పర్యటక శాఖ అభివృద్ధికి ఏ విధంగా కృషి చేశారు అని ఒక్కసారి తిరిగి చూసుకోవాలి. అదేవిధంగా కరోనా సమయంలో కరోనా బాధితులకు ఆక్సిజన్ అందక ఆక్సిజన్ సిలిండర్ అందుబాటులో లేని సమయంలో దాదాపు 30 కోట్లు ఖర్చుపెట్టి రాష్ట్రవ్యాప్తంగా కరోనా బాధితులకు సరైన సమయానికి ఆక్సిజన్ సిలిండర్లను అందించిన దాత చిరంజీవి గారు. అదేవిధంగా వైకాపా ప్రభుత్వం ప్రభుత్వాన్ని స్థాపించాక రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలు వీధిన పడి ఆర్తనాదాలు చేస్తున్న ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన లేదు. ఇలాంటి సమయంలో నేనున్నానంటూ తన సొంత సంపాదన నుండి దాదాపు 30 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కౌలు రైతుకు లక్ష రూపాయలు అందించిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పటంలో ప్రభుత్వం ఇళ్లను కూల్చివేస్తే రోడ్డున పడిన బాధితులను ఆదుకొని ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున దాదాపు 60 కుటుంబాలకు అందించిన మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. కేవలం ఇవే కాదు రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా ఎక్కడైనా సరే బూకంపాలూ, వరదలు సంభవిస్తే మొట్టమొదట స్పందించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే అది మెగా ఫ్యామిలీ వారే. అదే విధంగా నేత్రదానంలో గాని రక్తదానంలో కానీ, సేవా కార్యక్రమంలో కానీ ఎల్లప్పుడూ ముందుండే ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ. ఇలాంటి మెగా ఫ్యామిలీని తాను మంత్రిగా అవ్వగానే చిరంజీవి గారిని కలిసిన రోజా గారు, తన సినిమా నష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకున్న మెగా ఫ్యామిలీని నేడు పదవి కోసం దిగజారుడు మాట మాట్లాడటం అనేది ఎంత నీచత్వమో యావత్తు రాష్ట్రం చూస్తోంది. ఇప్పటికైనా ఈ చెత్త మాటలు తగ్గించి, తన పదవికి న్యాయం చేయాలని, నగిరిలో ఉన్న ప్రజలకు తనను గెలిపించినందుకు వారి వైపు ఒకసారి చూడాలని, అదేవిధంగా రోజా రాష్ట్రంలో ఉన్న మెగా ఫ్యామిలీ చేస్తున్న కానీ పక్క రాష్ట్రంలో ఉన్న తమిళనాడు వలన పోవడం చూస్తుంటే ఇక్కడ దుకాణం మూసివేసి తమిళనాడులో దుకాణం ప్రారంభించే ఆలోచనలో ఉందని స్పష్టంగా అర్థం అవుతుంది.. మా జిల్లాలో ఇలాంటి అడ్డు అదుపు లేని మున్సిపాలిటీ చెత్తకుప్పలాంటి నోరున్న రోజా లాంటి వాళ్ళు ఉండటం మేము చాలా దురదృష్టంగా భావిస్తున్నాం ఇప్పటికైనా తన ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే అని గుర్తుచేసుకొని, ఉన్నతమైన తన పదవికి న్యాయం ఏం చేయాలని జనసేన పార్టీ తరఫున దారం అనిత హెచ్చరించారు.