నోటి పొగరు రోజాను జంతువుతో పొల్చడంలో తప్పులేదు: గునుకుల కిషోర్

  • నోటి పొగరు రోజాను ఒక పార్టీ అధ్యక్షుడు మిమ్మల్ని జంతువుతో పోల్చారు మీ నోరు అది నిజం అనిపిస్తుంది

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు దానికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. తాజాగా మంత్రి రోజా మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే మెగా బ్రదర్ నాగబాబు ఆమె వ్యాఖ్యలను ఖండించారు. ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నెల్లూరు సిటీ గాంధీ బొమ్మ దగ్గర శనివారం మధ్యాహ్నం గం 2 లకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ.. మా పార్టీ పిఐసి మెంబర్ నాగబాబు గారు చెత్త కుప్ప తో పోల్చారు అక్కడ కుక్కలకైనా కూడా దొరుకుతుంది.. మీ చేత్తో ఒక మెతుకు పెట్టిన పాపాన మేము చూడలేదు. నోటి పొగురుతో అసభ్య పదజాలంతో నోటికొచ్చినట్లు మాట్లాడుతూ అహంకారపు దోరణి లో ఎస్సీలని ఎస్టీలనీ అహంకారంతో వ్యవహరిస్తూ ప్రజలకు మధ్య వేలుని చూపిస్తూ సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు రోజా.. రక్తదానం నేత్రదానం గురించి ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లిన మహోన్నత వ్యక్తి చిరంజీవి గారు, ఇప్పటికీ వారిస్పూర్తితో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాల్లో ఎక్కువగా వారి అభిమానుల నుంచి జనసేన పార్టీ నుంచి వస్తుందని తెలియ మీకు తెలియదా.. కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యం చెందితే ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించిన వైనం మరిచారా, అదే సమయంలో సినిమా కార్మికులు ఇబ్బంది పడుతున్నప్పుడు కోట్ల రూపాయలు వారికి ఇంటికి సరుకులు అందించిన గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. నోటికి వచ్చినట్లు మాట్లాడే రోజా గారు ప్రకృతి వైపరీత్యాలలో ఆర్దిక సహయం చేయటం లో జనసేన, మెగా హీరోలు మెగా కుటుంబ సభ్యులు ఎప్పుడూ ముందుంటారు అనే మాట మర్చిపోయినట్లున్నారు. పదవి శాశ్వతం కాదు వ్యక్తిగత ప్రవర్తన కచ్చితంగా ఉండాలి రానున్న రోజుల్లో మీరు ప్రజా క్షేత్రంలో తిరిగే పరిస్థితి ఉండదు. ప్రజలు తరిమి తరిమి కొట్టడం ఖాయం, పర్యాటక సంఘం గతంణలో దేశవ్యాప్తంగా తొమ్మిదవ స్థానంలో ఉంటే 18వ స్థానానికి తీసుకెళ్ళిన మీ ఘనతను ప్రజలందరూ చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వస్తుంటే టికెట్లు రేట్లు తగ్గించేస్తారు, ఏదైనా ఆవిర్భావ సభ జరుపుతామంటే ఫ్లెక్సీలు నిషేధిస్తారు, సభలో పెట్ట యువతను సన్మార్గంలో నడిపిస్తామంటే సభలు, ర్యాలీలు నిషేధం అంటారు. వై సిపీ నాయకులకు జంకు భయం మొదలైంది ఎక్కడ ప్రజలకు దగ్గరవుతారో ప్రతిపక్షాల అణిచివేద్దాం అనుకుంటునట్లున్నారు. మీరు మూట కట్టుకున్న పాపానికి రానున్న రోజుల్లో ప్రజలు సరైన తీర్పునిస్తారు. ఖబర్దార్ రోజా ఇప్పటికే డిఎస్పి గారికి కంప్లైంట్ చేసి ఉన్నాము. కచ్చితంగా నీ మీద స్థానిక స్టేషన్ లోన ఫిర్యాదు నమోదు చేయిస్తాం.నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. ప్రజలందరికీ గాజు గ్లాస్ కి ఓటు వేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలని తోడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గునుకుల కిషోర్ తో పాటు ఉమాదేవి, కృష్ణవేణి, నిర్మల, సుజాత, తులసి, నాగమణి, కంథర్ బాయ్, చిన్నరాజా, హేమంత్ యాదవ్, మౌనిష్, ప్రశాంత్ గౌడ్, ప్రతాప్, అమీన్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు.