రైతులను లక్షాధికారులు చేస్తానని బిచ్చగాళ్ళని చేస్తుంది ఈ ప్రభుత్వం : గాదె

ప్రత్తిపాడు నియోజకవర్గం, వట్టిచెరుకూరు మండలం, ముట్లూరు గ్రామంలో ఇటీవల అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంట పొలాలని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరావు మాట్లాడుతూ గత నెల 29వ తేదీ నుంచి నిన్నటి వరకు వర్షాలు పడినప్పటికీ ఇంతవరకు ప్రభుత్వం యంత్రాంగం స్పందించకపోవడం దారుణమని, మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా పనిచేసిన స్థానిక శాసనసభ్యులు మేకతోటి సుచరిత గారు ఇంత వరకు పర్యటన రాకపోవడం రైతుల పట్ల వారికున్న నిర్లక్ష్యాన్ని తెలియజేస్తుంది అని అన్నారు. రైతుని లక్షాధికారులు చేస్తున్నామని ఈ ప్రభుత్వం బిక్షం ఎత్తుకొనే స్థాయికి తీసుకొచ్చారు. మొక్కజొన్న పంట, తెల్ల జొన్న పంట, వరి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కోసిన పంటకు పరిహారం ఇవ్వమని, పొలం మీద ఉన్న పంటకు మాత్రమే పరిహారం ఇస్తామని చెప్పటం దారుణమని తెలియజేశారు. స్థానిక మండల వ్యవసాయ అధికారికి ఫోన్ చేసి అడుగగా ఇంతవరకు తమకు ఎటువంటి గైడ్లైన్స్ రాలేదని అవి వచ్చాక పంట నష్టం అంచనా వేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇంట్లో నుంచి బయటికి రాడని ఒకవేళ వచ్చిన బటన్ నొక్కి ఇంట్లోకి వెళ్లిపోతాడని క్షేత్రస్థాయిలో పర్యటన చేయని ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, వీలైనంత త్వరగా నష్ట పరిహారం అందించకపోతే ముఖ్యమంత్రి ఇంటి దగ్గర ధర్నా చేయవలసి ఉంటుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ సెక్రెటరీ నారదాసు ప్రసాద్, జిల్లా కార్యదర్శులు చట్టాల త్రినాథ్, మేకల రామయ్య, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు, నగర నాయకులు నెల్లూరు రాజేష్, వట్టిచెరుకూరు మండల అధ్యక్షులు పత్తి భవన్నారాయణ,ప్రతిపాడు మండల అధ్యక్షులు మక్కే సురేష్, ముట్లూరు గ్రామ అధ్యక్షులు కోటికం అబ్బాయిగారు, మండల నాయకులు పాపారావు, అల్లం దశరథ రామయ్య, కోట అనిల్, నామ శ్రీనివాసరావు, ఉపేంద్ర మరియు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.