తొండంగి మండల జనసేన పార్టీ సర్వసభ్య సమావేశం

తొండంగి: జనసేన పార్టీ తొండంగి మండలం సర్వసభ్య సమావేశం పి ఈ చిన్నయ్యపాలెం గ్రామంలో చిన్నాయపాలెం గ్రామ అధ్యక్షుడు వీసం ఆనందరావు అధ్యక్షతన, మండల కార్యదర్శి కొమిరెడ్డి వీరబాబు, కొమ్మిన రాజేష్, యూత్ ప్రెసిడెంట్ మనం రవి పర్యవేక్షణలో సాయంత్రం మూడు గంటలకు మీటింగ్ జరిగింది. మీటింగ్ సభ అధ్యక్షత బెండపూడి నాయుడు తీసుకుని మీటింగ్ లో ఈ క్రింది అజెండా అంశాలు చర్చించారు. ఎంపీ అభ్యర్థి సూచన మేరకు గ్రామ స్థాయిలో ప్రతీ గడప గడపకు వెళ్లి ప్రచారం ఏ విధంగా చేయాలి అనే దాని మీద చర్చ, ప్రచార కమిటీ నియామకం ఎన్నుకోవడం. టిడిపి జనసేన పార్టీ ల మధ్యసయోధ్య కోసం ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు గ్రామ అధ్యక్షులు జనసైనికులు పాల్గొన్నారు.