కోమటిపల్లి గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

గజపతినగరం, ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ ఆధ్యర్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం కోమటిపల్లి గ్రామంలో బుధవారం జనసేన జెండా ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. దీనికి ముక్య అతిథిగా మాజీ మంత్రి వర్యులు జనసేనపార్టీ పిఏసి సభ్యురాలు శ్రీమతి పడాల అరుణ మరియు జనసేనపార్టీ లీగల్ సెల్ గెద్ద రవి, టీడీపీ మండల అద్యక్షలు నాయకురాలు మంగ, ఎంపిటిసి చల్లా రామారావు, వైస్ ప్రెసిడెంట్ కొమటిపల్లి వసంత శ్రీనివాస, తెలుగు యువత అద్యక్షలు రాంసత్యం నారాయణరావు, టీడీపీ యువత, టీడీపీ కార్యకర్తలు మరియు జనసేన మండల అద్యక్షలు చప్ప అప్పరావు, మునకాల జగన్, విజయనగరం జిల్లా సీనియర్ నాయకులు మురళీమోహన్ లోకల్ బాయ్ ప్రసాద్, గజపతినగరం జనసేన నాయకులు యువనాయకులు శరత్ కుమార్, త్రివేది, యస్వంత్, వెంకట్ జనసైనికులు చీపురుపల్లి నియోజకవర్గ ఐటీ కో-ఆర్డినేటర్ అగురు వినోద్ కుమార్ మరియు కొమటిపల్లి జనసైనికులు చల్లా విజయ కుమార్, ప్రతాప్, గణేష్, శివాజీ, గ్రామ ప్రజలు దత్తిరాజేరు మండల జనసేనపార్టీ సీనియర్ నాయకులు సింహాద్రి ప్రవీణ్, సారికి మురళి, రవి, శ్రీను, బొత్స గణేష్ అందరూ పెదమానాపురం రైల్వే గేటు దగ్గరకు వచ్చి భారీ బైక్ ర్యాలీగా కోమటిపల్లి గ్రామానికి వెళ్తూ జనసేన జెండా ఎగర వేశారు భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యంగా జనసేన-తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణ అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించేలా పనిచేయాలి అని శ్రీమతి పడాల అరుణ అన్నారు. టీడీపీ జనసేన నాయకులు జాబ్ కేలెండర్, ప్రేత్యేక హోదా, మద్యపాన నిషేదం రోడ్లు సమస్యలు, విద్యుత్ చార్జీలు గురించి మండిపడ్డారు అలాగే 2024లో వచ్చేది జనసేన & తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వమే అని మాట్లాడటం జరిగింది. అలాగే జనసేన పార్టీ ఆధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి గ్రామంలో మంచి చేసే నాయకులు ఉండాలని అయన ఆలోచనలను ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్న జనసైనికులుకు, వీరమహిళలుకు, పవన్ కళ్యాణ్ అభిమానులు, మండలం ఆధ్యక్షులు, జిల్లా మరియు నియోజకవర్గం ముఖ్య నాయకులకు అందరకి ధన్యవాదాలు తెలిపారు. జిల్లా మొత్తం ఒక్కసారి మన నియోజకవర్గం వైపు చూసే విధంగా ఘనంగా ఈ వేడుకను జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని అన్నారు.