సత్యసాయి ట్రస్ట్‌ కార్మికులకు సంఘీభావంగా జనసేన మహాధర్నా

పోలవరం నియోజకవర్గం పోలవరంలో మహానుభావుడు సత్యసాయి ట్రస్ట్‌ నుండి ప్రజల దాహం తీర్చేదందుకు గోదావరి నదినుండి శుద్ది చేసిన త్రాగునీరు నాలుగు నియోజకవర్గాల ప్రజలకు 17 మండలాలకు దాదాపు 220నుండి 240 మెట్ట ఏజన్సీ గ్రామాలకు 7 నుండి 8 లక్షల ప్రజలకు నిత్యం త్రాగునీరు అందిస్థున్న సత్యసాయి మంచినీటి పథకం పంప్‌హౌస్‌ నుండి సంవత్సరం నుండి నీరు అందక ప్రజలు కలుషిత నీళ్ళు తాగి వ్యాదుల పాలవడం.. బోరు నీళ్ళు తాగలేక ప్లాంట్‌ వాటర్‌ కొనలేక పేదలు చాలా నరకం చూడడం జరుగుతుంది. నీళ్ళు రాకపోవడానికి ప్రధాన కారణం సంస్థలో పనిచేయు కార్మికులకు సంవత్సరంపై నుండి వేతనాలు లేకపోవడం నుండి జీతాలు లేకపోవడంతో 2006లో ప్రారంభమైన ఉచిత స్వచ్చమైన గోదావరి నీరు అందే సత్యసాయి మంచినీటి పథకాన్ని 2007 లో ప్రభుత్వానికి హేండోవర్‌ చేసారు ప్రభుత్వం దీనికి బోర్ఢ్‌ చైర్మన్‌గా కలెక్టర్‌ని నియమించి ఎల్&టి సంస్థకు అప్పజెప్పడం జరిగింది. అప్పట్నుంచి నడుస్తూ ఉన్న వ్యవస్థని జగన్‌ ప్రభుత్వం ఎక్కిన ఏడాది లోపే ఎల్&టి కి భిల్‌ చేయకుండా ఆపేయడం.. వారు కార్మికులకు జీతాలు ఆపేయడం.. ప్రధాన కారణం.
16 సంవత్సరాలనుండి సంస్థలో పనిచేస్తూ సంవత్సరంపైనుండి జీతాలు లేక అలో లక్ష్మణా అంటున్న కార్మికులకు, త్రాగునీరు లేక ప్రజలకు సంఘీభావంగా మేమున్నాం గురువారం పోలవరం నడిబొడ్డున మహాధర్నా నిర్వహించి ప్రభుత్వ తీరును ఎండగట్టి తూర్పారబెట్టుటం జరిగింది. సజావుగా సాగే వ్యవస్థపై సమస్యలు సృష్టించడం కొన్నాళ్ళు ప్రజల్ని ఇబ్బందులు పెట్టడం తరవాత మేము పరిస్కారం చేస్తాం అంటూ.. ధుర్మర్ఘపు ఆటవిక పాలనపై నిప్పులు జిల్లా నియోజకకవర్గ నాయకులు చెరిగారు.. ఈ కార్యక్రమంలో పోలవరం ఇంచార్జి చిర్రి బాలరాజు, స్టేట్‌ జనసేన కార్యధర్శి మరియు దెందులూరు ఇంచార్జ్‌ శ్రీమతి గంటశాల వెంకటలక్ష్మి, జిల్లా ప్రధాన కార్యధర్శి కరాటం సాయి, మరో ప్రధాన కార్యధర్శి ఎంట్రపాటి రాజు జిల్లా కార్యధర్శి గడ్డమణుగు రవికుమార్‌, గాయత్రి వెంకటేశ్వరావు, జిల్లా సంయుక్త కార్యధర్శి పాదం కృష్ణ&, జక్కుల శ్రీను, పోలవరం నియోజకవర్గ ఏడు మండల అద్యక్షులు, తాళ్ళపూడి మండల అద్యక్షులు, గోపాలపురం అద్యకులు మరియు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేసారు.