వైసీపీ సోషల్ మీడియా అకృత్యాలను ఖండించిన తోలేటి శిరీష

పిఠాపురం నియోజకవర్గం: జనసేన పార్టీ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలుపుతూ, మరియు వైసీపీ సోషల్ మీడియా అకృత్యాలపై నిరసన తెలుపుతూ ఆదివారం జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి తోలేటి శిరీష ప్రెస్ మీట్ నిర్వహించారు. జనసేన పార్టీ నాయకులు వెన్నా జగదీష్ సమక్షంలో పిఠాపురం పట్టణముందు గల సూర్య గ్రంథాలయం నందు నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని తోలేటి శిరీష వివరిస్తూ జనసేన వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నవరం నుంచి భీమవరం వరకు తొలి విడతగా నిర్వహించిన వారాహి యాత్ర నందు మీడియా కోఆర్డినేటర్ గా తాను అందించిన సేవలను గుర్తించి జనసేన అధిష్టానం మంగళగిరి పార్టీ ఆఫీసుకు పిలిచి అభినందించిన సందర్భాన్ని పురస్కరించుకుని, తనపై నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతలు అప్పజెప్పిన అధినేత పవన్ కళ్యాణ్, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు కందుల దుర్గేష్, పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్, మీడియా కమిటీ హెడ్ అజయ్ వర్మలకు కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి అభినందనలతో కలిగిన ఈ ఉత్సాహంతో పార్టీ అధిష్టానం ఏ సందర్భంలోనైనా ఏ సమయంలోనైనా ఎటువంటి బాధ్యతను అప్పగించిన నిర్వహించడానికి తాను సన్నద్ధంగా ఉన్నానని తెలుపుతూ, నా నిబద్ధతను గుర్తిస్తూ మొదటినుంచి ప్రోత్సాహం అందించిన జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్, మీడియా విభాగంలో విలువైన సూచనలు సలహాలు ఇచ్చిన మీడియా వింగ్ హెడ్ వర్మలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు. మరియు శనివారం పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా వైసిపి సోషల్ మీడియా ఉన్మాది వర్రా సురేందర్ రెడ్డి పై వివిధ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగిందని వివరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ నాయకులు వెన్నా జగదీష్ మాట్లాడుతూ మొదటిగా తోలేటి శిరీషకు అభినందనలు తెలుపుతూ వైసిపి సోషల్ మీడియా విభాగపు కార్యకర్త వర్రా సురేందర్ రెడ్డి వ్యవహార శైలిని తీవ్రంగా ఖండిస్తూ వైసిపి పార్టీ విలువలకు తిలోధకాలు ఇచ్చేసిందని, సాక్షాత్తు ముఖ్యమంత్రి పసిపిల్లలతో నిర్వహించిన అమ్మ ఒడి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి వారి కార్యకర్తలకు తప్పుడుగా దిశా నిర్దేశాన్ని ఇచ్చారని తెలియజేశారు. రూరల్ మండల నాయకులు పిల్ల దినేష్ మాట్లాడుతూ మా అధినాయకున్ని సిద్ధాంతంగా ఎదుర్కోలేని వైసిపి పార్టీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై అవాస్తవ కథనాలను ప్రచారం చేస్తున్నారని వారికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రతి జనసైనికులు, వీరమహిళలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టౌన్ నాయకులు వేల్పుల చక్రధర్, బాలిపల్లి అనిల్, రూరల్ మండల నాయకులు అడపా శివరామకృష్ణ, గంజి గోవిందరాజు, బత్తుల దొరబాబు, పులి వెంకట రమణ, ముమ్మిడి రామారావు, తోలేటి సంజీవ్ మరియు నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.