వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ట్రేడ్‌ అప్రెంటిస్‌ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌(ఆర్‌ఐఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలోని విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌.. అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 మొత్తం ఖాళీల సంఖ్య: 319

 విభాగాల వారీగా ఖాళీల వివరాలు: ఫిట్టర్‌-75, టర్నర్‌-10, మెషినిస్ట్‌-20, వెల్డర్‌(గ్యాస్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌)-40, మెకానిక్‌ మెషిన్‌ టూల్‌ మెయింటెనెన్స్‌-20, ఎలక్ట్రీషియన్‌-60, కార్పెంటర్‌-20, మెకానిక్‌ రిఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌కండిషనింగ్‌-14, మెకానిక్‌ డీజిల్‌-30, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్‌-30.

 అర్హత: ఐటీఐ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌ కలిగి ఉండాలి.

 వయసు: 01.10.2020 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

 ఎంపిక విధానం: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 150 ప్రశ్నలు-150 మార్కులకు పరీక్ష ఉంటుంది.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 దరఖాస్తులకు చివరి తేది: 17.07.2021

 వెబ్‌సైట్‌: www.vizagsteel.com