“ఓం శివశక్తి పీఠం” వ్యవస్థాపకులు బత్తుల బలరామకృష్ణ దంపతులకు సత్కారం

రాజానగరం నియోజకవర్గం, ఏ కార్యక్రమ నిర్వాహకులకైనా…. ఆ కార్యక్రమం అత్యంత విజయవంతం అయితే వారికి కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. అటువంటి మధురానుభూతే రాజానగరం మండలం, చక్రాద్వారబంధం గ్రామంలో “శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద స్వామీజీ” విశిష్ట అతిథిగా చక్రాద్వారబంధం గ్రామంలో గ్రామ ప్రతిష్ట పెంచేవిధంగా, అంగరంగ వైభవంగా, జిల్లా స్థాయిలో, చరిత్రలోనే ఓ అద్భుత ఘట్టంలా నిలిచేలా జరిగిన “హరిహరుల కళ్యాణం” “హరిహర పుత్రవైభోగం” కొన్ని వేలాదిమంది అయ్యప్ప స్వాములచే “అయ్యప్పల పడిపూజ” కార్యక్రమం చక్రాద్వారబంధం గ్రామంలో అత్యంత వైభవంగా జరగడంతో కలిగింది. ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో అతిధులుగా పాల్గొన్న ఆధ్యాత్మికవేత్త, “ఓం శివశక్తి పీఠం” వ్యవస్థాపకులు, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు “నా సేన కోసం నా వంతు” కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతులను వారి స్వగృహం నందు కార్యక్రమ నిర్వాహకులు కలిసి, స్వామి వారి తీర్థ ప్రసాదాన్ని అందజేసి “బత్తుల” దంపతులకు దుశ్శాలువాతో చిరు సత్కారాన్ని అందజేశారు. కార్యక్రమ నిర్వహణ నిమిత్తం “బత్తుల” దంపతులు 50,000/౼ వేల రూపాయలు ప్రకటించగా, వాటిని శనివారం నిర్వాకులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గురుస్వాములు, స్వాములు, చక్రద్వారబంధం గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఆనందాల గోవింద్, సీనియర్ నేత కురుమళ్ళ మహేష్ పాల్గొన్నారు.