డాక్టర్ బి.ఆర్ అంబేద్కరుకు ఘననివాళి

గుంటూరు, భారత రాజ్యాంగ రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరగని కృషిచేసిన మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.