జనసేనపార్టీ ఆధ్వర్యంలో జనసేన వీరమహిళలకు సన్మానం

*నదిమిదొడ్డి సర్పంచ్ అభ్యర్ధిని బుసిపల్లి చెన్నమ్మ
*నార్పల ఒకటవ ఎంపీటీసీ అభ్యర్థిని గుమ్మడిసాని శిల్ప
*నార్పల 4 ఎంపీటీసీ అభ్యర్థిని
*రాయదుర్గం తేజ లక్ష్మి
*ఘనంగా సన్మానించిన జనసేన

నార్పల, జనసేన పార్టీ ఆవిర్భావం నుండి క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న వీరమహిళలకు ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ మేరకు మంగళగిరిలోని జనసేనపార్టీ కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమానికి జనసేనపార్టీ వీరమహిళా విభాగం రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు పెండ్యాల శ్రీలత, పసుపులేటి పద్మావతి ల ఆధ్వర్యంలో జిల్లా నుండి పలువురు మహిళలు వెళ్లడం జరిగిందని, పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొంటూ… క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం చేస్తూ. ఇటీవల జరిగిన పంచాయితీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ దౌర్జన్యాలకు ఎదురొడ్డి నార్పల ప్రాంతం నుండి జనసేనపార్టీ తరుపున బరిలో నిల్చున్న వారికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా జనసేనపార్టీ రాష్ట్ర కార్యాలయంనందు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పార్టీలో మహిళలకు పెద్ద పీట వేస్తూ మహిళల కోసం పార్టీలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి వీరమహిళా విభాగం అని నామకరణం చేసి మరింత గౌరవం పెంచారని. తమ సేవలను గుర్తించి మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో సన్మానించడం ఆనందంగా ఉందన్నారు. జనసేనపార్టీ అభివృద్ధి కోసం మరింత రెట్టింపు ఉత్సాహంతో పని చేసి, 2024 ఎన్నికల్లో జనసేనపార్టీ అధికారమే లక్ష్యంగా మా వంతు కృషి చేస్తామన్నారు.