అడ్డతీగలలో టీడీపీ నిరసన దీక్షకు జనసేన మద్దతు

రంపచోడవరం నియోజవర్గం: అడ్డతీగలలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా బాబుకి మేము ఉన్నాం తోడుగా అంటూ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన అడ్డతీగల యంపిడీవో ఆఫీస్ పక్కన దీక్షా శిబిరం కార్యక్రమానికి జనసేన పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. యంపిడీవో ఆఫీస్ నుంచి ర్యాలీగా దేవి గుడి సెంటర్ మార్కెట్ వీధుల్లో జనసేన టిడిపి కలిసి సీఎం డాం డాం.. జనసేన టిడిపి ఐక్యత వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి అనే నినాదాలతో జనసేన పార్టీ టిడిపి పార్టీ భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు కుప్పాల జయరాం, చోళ్ళ కృష్ణారెడ్డి, పొడుగు సాయి, బాలు, రాజవొమ్మంగి మండలం జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ బొద్దిరెడ్డి త్రిమూర్తులు, లోకేష్, మళ్లీ కాసులు, చిట్టి బాబు వైరామవరం మండలం జనసేన పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్, మరియు తదితరులు పాల్గొన్నారు.