ఇచ్చాపురం జనసేన ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ కు ఘన నివాళులు

ఇచ్చాపురం: నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఇచ్చాపురం మండలం, తులసిగం పంచాయతీ ఇన్నేసుపేట గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మరియు దుంగు భాస్కర్ రెడ్డి, గ్రామ జనసైనికులు, గ్రామ పెద్దలు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ “1879లో జనవరి 23న ఒడిశాలోని కటక్‌లో నేతాజీగా గుర్తింపు పొందిన సుభాష్ చంద్రబోస్ జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించాడు. రామకృష్ణ పరమహసం, స్వామి వివేకానందుడి మార్గంలో పయనించి సన్యాసం తీసుకోడానికి తీర్మానించాడు. వారు ఉపదేశించిన దేశాభిమానంతో ముందుకు సాగాడు. జాతీయ కాంగ్రెస్‌లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలు పంచుకున్నాడు. బ్రిటిష్‌ ‌వారిని తరిమికొట్టడానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంగ్లాండ్‌ ‌వ్యతిరేకులను కలసి ఒక ఐక్యకార్యాచరణ కార్యక్రమానికి ప్రయత్నం చేసాడు. ఆజాద్ హింద్ ఫౌజ్‌ సంస్థను స్థాపించి ఆర్మీని ఏర్పాటు చేసాడు. స్వాతంత్ర పోరాట సమయంలో బ్రిటీష్‌ ‌కు వ్యతిరేఖంగా జైళుకు వెళ్లిన బోస్‌, 1936‌లో దేశ బహిష్కరణకు కూడా గురయ్యాడు. 1945లో ఆగ‌స్ట్ 18న తైపీలో జ‌రిగిన విమాన ప్రమాదంలో అనూహ్య రీతిలో సుభాష్ చంద్రబోస్ మ‌ర‌ణించినట్లు భావిస్తున్నారు. నేతాజి అదృశ్యం పై నేటికీ వివాదం కొన‌సాగుతూనే ఉంది.” అని గుర్తుచేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆయన అస్థికలను రెంకోజీ నుండీ మన దేశం ఎర్ర కోటకు తీసుకురావాలనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆకాంక్ష త్వరలో సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని దుర్యోధన రెడ్డి అన్నారు.