కందుల దుర్గేష్ ఆధ్వర్యంలో క్రియాశీల కార్యకర్తలకు ఘన సన్మానం

ధవళేశ్వరం: క్రియాశీల కిట్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా.. జనసేన పార్టీ కోసం అహర్నిశలు కష్టపడే జనసైనికులకు అండగా ఉండాలనే పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు.. ఆదివారం ధవళేశ్వరం గ్రామంలో జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా క్రియాశీల కార్యకర్తలకు సన్మానం కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.