ములకలపల్లి జనసేన కార్యాలయంలో అంబేద్కర్ కు ఘన నివాళులు

తెలంగాణ: భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వరావుపేట నియోజకవర్గం, ములకలపల్లి మండల జనసేన పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గరికే రాంబాబు, మండల సహాయ కార్యదర్శి బొక్క వెంకటేశ్వర్లు, మండల మైనార్టీ నాయకులు ఎస్ కే జాన్ పాషా గ్రామ కమిటీ నాయకులు గోపగాని సాయి ప్రకాష్, అలుగుల శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.