గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో నేతాజీకి నివాళులు

అవనిగడ్డ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా అవనిగడ్డ నియోజకవర్గము, అవనిగడ్డలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో అవనిగడ్డలో నేతాజీ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరిగింది. జనసేన నాయకులు జేమ్స్, నేతాజీ చిత్రపటానికి పూలమాల వేసి, నేతాజీ గురించి ప్రారంభ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు రాయపూడి వేణుగోపాలరావు, బచ్చు వెంకటనాధ్, రాజనాల వీరబాబు, బచ్చు రఘునాధ్, గుగ్గిలం అనీల్, పప్పుశెట్టి శ్రీను, నాగరాజు, ఫరీద్, చందు తదితరులు పాల్గొన్నారు.