ఉద్రిక్తతను సైతం ఎదుర్కొనేoదుకు దళాలు సిద్దంగా ఉన్నాయి: ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె

చైనాతో సరిహద్దు సమస్య తలెత్తిన కారణంగా.. ఆర్మీ చీఫ్‌ జనరల్ ఎంఎం నరవాణె లేహ్‌లో పర్యటిoచారు. ఈపర్యటన  నేపధ్యంలో మీడియాతో మాట్లాడుతూ.. లేహ్ చేరుకున్న తర్వాత పలు ప్రాంతాలను విజిట్ చేశానని, ఆఫీసర్లు, జేసీవోలతో మాట్లాడానని, దళాలు ఎంత వరకు సంసిద్ధంగా ఉన్నాయో తెలుసుకున్నట్లు నరవాణె చెప్పారు. జవాన్లలో స్పూర్తి అత్యధిక స్థాయిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎటువంటి సవాళ్లను అయినా ఎదుర్కొనేందుకు వారంతా సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

వాస్తవాధీన వెంటు పరిస్థితి కొంత ఉద్రిక్తంగానే ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ నరవాణె తెలిపారు. ఈ పరిస్థితిని అంచనా వేసి దానికి తగినట్లుగా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, దానిలో భాగంగానే ఎల్ఏసీ వెంట బలగాలను పెంచినట్లు చెప్పారు. మన భద్రత, ఐక్యత సురక్షితంగా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. గత రెండు మూడు నెలల నుంచి ఎల్ఏసీ వెంట పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నట్లు చెప్పారు. కానీ సైనిక, దౌత్యపరమైన స్థాయిలో చైనాతో నిరంతరం చర్చలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో కూడా చర్చలు నిర్వహిస్తూనే ఉంటామన్నారు.

చర్చల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందన్న నమ్మకం ఉన్నట్లు ఆర్మీ చీఫ్ జనరల్ తెలిపారు. చైనాతో ఉన్న విభేదాలను పరిష్కరించనున్నట్లు చెప్పారు. ఎల్ఏసీ వద్ద ఆక్రమణలు జరగనివ్వమని, మన సరిహద్దుల్ని మనం రక్షించుకుంటామన్నారు.