ట్రూ అప్ చార్జీలను తగ్గించాలి: అతికారి దినేష్

రాజంపేట: కరెంటు చార్జీలు పెంచుతూ, అసలే వేసవి కాలంలో విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది అటువంటి సమయంలో విద్యుత్ చార్జీలను పెంచడం వలన వైసీపీ ప్రభుత్వం ప్రజల పైన మోయలేని పెనుబారం మోపుతున్నారని జనసేన పార్టీ రాజంపేట నియోజకవర్గం నాయకులు అతికారి దినేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్ తన పాదయాత్ర సమయంలో కరెంటు చార్జీలు బాదుడే బాదుడు అని నాటకాలు ఆడి తాము అధికారంలోకి వస్తే కరెంటు చార్జీలు పెంచబోమని ప్రతి ఊరు తిరిగి చెప్పిన జగన్ మాట తప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు 6వ సారీ మళ్ళీ విద్యుత్ చార్జీలు పెంచడం దుర్మార్గమైన చర్య అన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నామని ఒక రూపాయి ప్రజలకు ఇచ్చి పది రూపాయలు ప్రజల పైన పన్నుల భారం వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ తీరు వలన నిత్యవసరలన్నీ పెరిగిపోయాయి సామాన్య ప్రజలు బ్రతుకు భారంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలు ఉపసంహరించుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ కనుమరుగయ్యేలా ప్రజలు తీర్పిస్తారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు పాల్గొన్నారు.