అధికార వైసీపీ పార్టీ నుండి సునామిలా జనసేనలోకి చేరికలు

నెల్లిమర్ల నియోజకవర్గ భోగాపురం మండలంలోని జనసేన పార్టీ ఆఫీసు ప్రాంగణంలో వైసీపీ పార్టీకి చెందిన ముఖ్య నేతలు మరియు వారి అనుచరవర్గం శ్రీమతి లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వీరందరికీ పార్టీ కండువా కప్పి నెల్లిమర్ల నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయిన శ్రీమతి లోకం మాధవి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. వీరిలో ముఖ్య నాయకులు, నెల్లిమర్ల నియోజకవర్గంలో వెన్నుదన్నుగా వైసీపీకి నిలిచిన మాజీ సిఈసి మెంబెర్ కాకర్లపూడి శ్రీనివాసరాజు, భోగాపురం వైస్ ప్రెసిడెంట్ బలిపల్లి సత్తిబాబు, వార్డ్ మెంబెర్ గుండపు నానాజీ, అలాగే డెంకాడ మండలానికి చెందిన ఎక్స్ జడ్పిటిసి, ఎఫ్.ఎస్.సి.ఎస్ చైర్మన్ కంది సూర్యనారాయణ, ఎక్స్ ఎంపిటిసి కంది రాజు, అక్కివరం సిట్టింగ్ సర్పంచ్ కంది కిరణ్ కుమార్, ఏఎక్స్ సర్పంచ్, ఎంపీటీసీ, పిఏసిఎస్ డైరెక్టర్ మహంతి నరసి నాయుడు, మహంతి ప్రసాద్, మాజీ ప్రెసిడెంట్ కలిశెట్టి రమేష్, మహంతి చిన్నం నాయుడు, మహంతి ప్రభాకర్ రావు, గోవిందపురం ఎక్స్- ప్రెసిడెంట్ బల్లి రామలక్ష్మి, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ బలి అప్పలరాజు, పంటమాని లక్ష్మినారాయణ, పట్టేపు శ్రీనివాసరావు, కింతడ లక్ష్మి, బోనారి నాయుడు, సూది కొండ సంతోష్, మొంగము నరాయన రావు ఎక్స్ ఎంపీటీ్సి, ఎక్స్ పూసపాటిరేగ మండల ప్రెసిడెంట్ మంతి శివ, ఎక్స్ వార్డ్ మెంబెర్ ఎం శశిరేఖ, వార్డ్ మెంబెర్ ఎన్ సూరమ్మ, కోప్పెర్ల సిట్టింగ్ ప్రెసిడెంట్ సంకబత్తుల సత్తిబాబు, లక్ష్మణ్ రావు, పతివాడ పంచాయతీకి చెందిన ఎక్స్ ప్రెసిడెంట్ పండడు, వార్డ్ మెంబెర్ వల్లే శ్రీరాములు మరియు తదితర నాయకులు జనసేన తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో జాయిన్ అయిన నాయకులు మాట్లాడుతూ శ్రీమతి లోకం మాధవి గెలుపే లక్ష్యంగా జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నామని, గత ఐదేళ్లగా అధికార వైసిపి పార్టీ గాని స్థానిక ఎమ్మెల్యే బడికొండ అప్పలనాయుడు కానీ నెల్లిమర్ల నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని, నాయకులకు విలువ ఇవ్వలేదని ఈ ఎన్నికల్లో కచ్చితంగా బడికొండ అప్పలనాయుడుని ఓడిస్తామని, శ్రీమతి లోకం మాధవిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు. శ్రీమతి లోకం మాధవి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంతమంది నాయకులు ఈరోజు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, వీరి రాకతో జనసేన పార్టీ మరింత పుంజుకుందని, ఒక మంచి కార్యం కోసం వచ్చిన అందరి నాయకులకు తను సాదర స్వాగతం తెలియజేస్తున్నానని జనసేన పార్టీలో తగిన గౌరవ మర్యాదలు ఎల్లప్పుడూ ఉంటాయని, నియోజకవర్గం అభివృద్ధి బాటలో పెట్టేలా, చదువుకున్న యువతకి ఉపాధి కల్పించేలా, రైతన్నకి మత్స్యకారులకి అండగా నిలబడేలా అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని తెలియజేశారు.