రాజానగరం జనసేన పార్టీలో చేరికలు

రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం, కోటి గ్రామానికి చెందిన పలువులు వైస్సార్సీపీ నాయకులు రాజానగరం నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న ఆగడాలు అకృత్యాలు దోపిడీ దౌర్జన్యం దుర్మార్గపు పాలనకు విసుగు చెంది ఎస్సీ సామాజికవర్గ నాయకులు నండూరి మంగరాజు ఆధ్వర్యంలో బర్ల వెంకట్ రావు, అంబటి అబ్బులు, దండింగి రామ లక్ష్మణరావు, అంబటి అచ్చయ్య, అంబటి భీమయ్య, మురారి దేవుళ్ళు, అడపా నాగేశ్వరరావు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్ధాంతాలు నచ్చి రాజనగరం నియోజకవర్గంలో బత్తుల బలరామకృష్ణ అహర్నిశలు పాటుపడుతున్న విధానం అనునిత్యం ప్రజా క్షేమమే లక్ష్యంగా నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలతో మమేకమై వారి కష్ట సుఖాల్లో తోడుగా ఉంటున్న జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ సమక్షంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన బత్తుల. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.