యూఏఈ జనసేన కోర్ కమిటీ సమావేశం

యూఏఈ జనసేన కోర్ కమిటీ సభ్యులు సోమవారం సంక్రాంతి సంబరాలు విజయవంతంగా నిర్వహించటంపై ఒక విశ్లేషణతో కూడిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశంలో భాగంగా సభ్యులందరూ సంక్రాంతి సంబరాలు సంబంధించిన కార్యక్రమం చాలా అద్భుతంగా జరగడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కొటికలపూడి గోవిందరావు కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ మీటింగ్ లో భవిష్యత్తులో యూఏఈ జనసేన చేయబోయే అనేక కార్యక్రమాల గురించి చర్చించడం జరిగింది. ముఖ్యంగా జనసేన ఫార్మేషన్ డే సందర్భంగా మార్చి 11న దుబాయిలో ఒక భారీ స్థాయిలో జనసేన వీరమహిళలతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిర్ణయం తీసుకోబడింది. ఈ కార్యక్రమానికి జనసేన నుండి కొంతమంది అధికారిక వీరమహిళలను పిలవడానికి నిర్ణయించుకోవడం జరిగింది. అలాగే యూఏఈ జనసేనలో ఒక ప్రత్యేకమైన వీరమహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు, వారిని ఆంధ్రాలో ఉన్న జనసేన పార్టీ వీరమహిళలతో అనుసంధానం చేయడం జరుగుతుంది. బూత్ లెవెల్ లో పార్టీని ఎలా బలోపేతం చేయాలో దానికి జనసైనికులకు ఇవ్వాల్సిన శిక్షణ కోసం కావలసిన మెటీరియల్ అంతా రెడీ చేయడం జరిగింది. అతి త్వరలో ఈ శిక్షణ కార్యక్రమాలు మొదలవుతాయి. ఇక చివరిగా కోర్ కమిటీ సభ్యులందరూ ఏకగ్రీవంగా పాపోలు అప్పారావుని యుఏఈ జనసేన యొక్క అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పాపోలు అప్పారావు మాట్లాడుతూ యూఏఈ జనసేనను ప్రపంచంలో ఉన్న మిగతా వారికి ఒక రోల్ మోడల్ లాగా తయారు చేయడానికి శాయిశక్తుల ప్రయత్నిస్తానని పాపోలు అప్పారావు చెప్పారు. అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు కోర్ కమిటీ సభ్యులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.