దేవ వరప్రసాద్ ఇంటివద్ద ఘనంగా ఉగాది వేడుకలు

రాజోలు, తెలుగు సంవత్సరాది క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని రాజోలు నియోజకవర్గ జనసేన-టీడిపి-బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ ఐ.ఏ.ఎస్(రిటైర్డ్) నివాసం వద్ద పంచాంగ శ్రవణ కార్యక్రమం వేదపండితులు, పంచాంగకర్తల వైకానాస మాదాచార్యులు ఖండవల్లి సూర్య సత్యనారయణ శాస్త్రి ఆధ్వర్యంలో రాశిఫలాల తోపాటు పంచాంగ శ్రవణం ఆనంతరం ఆహూతులందరికీ ఉగాది పచ్చడి వితరణ చేసారు. ఈ పంచాంగ శ్రవణ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజలు, జనసేన, తెదేపా మరియు భాజపా పార్టీల రాష్ట్ర, జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు, సర్పంచ్ లు ఎంపీటీసీలు వార్డ్ మెంబర్లు, ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు, వీర మహిళలు పాల్గొన్నారు.