జనసేన-టిడిపి ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గ, వీరఘట్టం మండల జనసేన నాయుకులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పాలకొండ నియోజక వర్గ జనసేన పార్టీ ఇంచార్జి నిమ్మల నిబ్రమ్ ఆదేశాల మేరకు రొడ్లు దుస్థితి తెలియజేసిన జనసైనికులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గురించి ఇతర రాష్ట్రాల వాళ్ళు పెట్టిన పేరు ‘గుంతల ఆంధ్రప్రదేశ్’. కానీ కళ్ళకు గంతలు కట్టుకున్న వైసీపీ పాలకులకు రోడ్లపై గుంతలు కనిపించడం లేదు. అందుకే తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడిగా “గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది?” చేపట్టాయి. జనసేన నేతలు, కార్యకర్తలందరూ రోడ్ల మీదికి రండి! ఎక్కడ గుంత కనిపిస్తే అక్కడ సెల్ఫీ దిగి ఆ ఫోటోలను, వీడియోలను #GunthalaRajyamAP, #WhyAPHatesJagan హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో షేర్ చేయండి. వైస్సార్సీపీ పాలకుల కళ్ళు తెరిపించండి అని వీరఘట్టం మండల జనసేన ఎంపీటీసీ అభ్యర్థి మీ జనసేన జానీ అన్నారు. వీరఘట్టం మండలం కిమ్మి గ్రామ రోడ్ దుస్థితి తెలుపుతూ మాట్లాడారు. కిమ్మి రహదారి నిర్మాణం చేపట్టాలని, కిమ్మి వద్ద నాగావళి నది పై బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయినప్పటికీ రోడ్ వేయలేదని, ఉన్న రోడ్డు గుంతలతో నిడివుంది, ఈ రోడ్ లో ప్రయాణిస్తున్న ప్రయాణీకులు అత్యవసర పరిస్థితుల్లో ప్రయనిచడం కష్టంగావుంది, ఈ రహదారి వేస్తే రాజాం, విజయనగరం, బొబ్బిలి, తదితర పట్టణాలకు వెళ్లేఒదుకు సమయం, డబ్బు రెండు ప్రజలకు ఉపయోగపడుతుంది అని జనసైనికులు అన్నారు. వాహనదారులుతో ప్రజలతో ప్రజా సమస్యలుపైన అడిగితెలుసుకుంటున్నా వీరఘట్టం మండలం జనసేన జానీ బృందం ఈ కార్యక్రమంలో వీరఘట్టం మండల నాయుకులు మత్స పుండరీకం, పండు, సంతు, చరణ్, సాయిపవన్, అచ్యుత్, రాజు ప్రణీత్, స్థానిక ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.