డాక్టర్ శ్రీధర్ పిల్లా ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జనసేన వనసమారాధన

  • 15వేల మందికి పైగా జనసైనికులు
  • కుల మతాలకు అతీతంగా జనసేన కార్తీక సమారాధన

పిఠాపురం, కుల మతాలకు అతీతంగా పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా జనసేన కార్తీక వనసమారాధన – జనసైనికుల ఆత్మీయ సమావేశ కార్యక్రమం కని విని ఎరుగునటువంటి రీతిలో ఆదివారం నాడు కుల మతాలకు అతీతంగా నిర్వహించడం జరిగింది. జనసేన కార్తిక వన సమారాధన కార్యక్రమంలో ఊహించని రీతిలో జనసేన సముద్రం ఉప్పెనలా పొంగి 15వేల మందికి పైగా ఈ కార్తీక వనసమారాధనలో పాల్గొనడం జరిగింది. జనసైనికుల ఆత్మీయ సమ్మేళనంలో జనశ్రేణులు మరియు బీజేపీ నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే నిత్య గానాలు, పవన్ కళ్యాణ్ స్పీచ్ ల మధ్య జనసేనకు ఎప్పుడూ వెన్నంటే ఉంటూ తోడుగా ఉండే జనసేన నాయకులకు, వీరమహిళలకు, సేవా తాత్పర్యులకు, అలాగే మిత్రపక్షంగా ఉన్నటువంటి బీజేపీ రాష్ట్ర నాయకులకు గౌరవ సన్మానాలతో ప్రారంభమై జనసైనికుల జన సముద్రాన్ని చూసిన డాక్టర్ శ్రీధర్ పిల్లా వేదికపై మాట్లాడుతూ ఈ నాటి ముఖ్య అతిధి ముక్కా శ్రీనివాస్ ఆయన జిల్లాలోనే పార్టీ అధ్యక్షులు స్వయంగా వారే జగనన్న మోసాలు – జగనన్న ఇళ్ళు పేదలందరికీ కన్నీళ్లు అనే కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఇక్కడి కార్యక్రమానికి రాలేనప్పటికి వారి సంఘీభావం ఫోన్ ద్వారా తెలిపారన్నారు. జనసైనికులు, వీర మహిళలు, నాయకులు అందరం కలిసి నేను కూడా ఒక జనసైనికుడిగా మీలో ఒకడిగా మనమందరం కలిసి ఈరోజు ఇక్కడ కులమతాలకు అతీతంగా రాజకీయం చెయ్యాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు ప్రధమ సిద్దాంతాలైన కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయమైన వాటిని అనుసరిస్తూ పెట్టడం దాన్ని నిరూపించే విధంగా ఈరోజు ఇక్కడ కులం మతాలకు అతీతంగా మేమందరం జనసైనికులం ఒకే కులం ఒకే మతంగా నిరూపించే విధంగా ఈ కార్తీక మాసం వనభోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతటి అశేష జనసంద్రోహంగా మారిన జనసైనికులను, వీరమహిళలను జనశ్రేణులను, నియోజకవర్గ ప్రజలను నాకు అందించిన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఆజన్మాంతం ఋణగ్రస్థుడునై ఉంటాను నిత్యం ప్రతి ఒక్క జనసైనికుల కష్టంలో తోడుగా ఉంటాను, ప్రతీ ఒక్కరికీ నా వంతు సహకారాన్ని మరింత అందించడానికి నేను ఎప్పుడూ ముందుంటానని ఈ సభాముఖంగా మరోసారి మీకు తెలియజేస్తున్నానని ఎంతో భావోగ్వేదంతో జనసేన అనే ఒక పిలుపుమేరకు వేలాది మంది జనం ఇక్కడికి రావడం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వీర మహిళలకు, పిఠాపురం నియోజకవర్గ జనశ్రేణులకు, ప్రజలకు అలాగే కాకినాడ, రాజమండ్రి నుంచి వచ్చిన జనసైనికులకు, మిత్రపక్షం అయిన బీజేపీ పార్టీ నాయకులకు కూడా డాక్టర్ శ్రీధర్ పిల్లా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.