కదిరి జనసేన ఆధ్వర్యంలో టి.సి. వరుణ్ పుట్టిన రోజు వేడుకలు

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒకే ఒక పిలుపుతో జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ నిత్యం పార్టీ బలోపేతం కోసం, జనసేన పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్న యువనాయకులు ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు టి.సి. వరుణ్ అన్న పుట్టిన రోజు వేడుకలు కదిరి నియోజకవర్గం ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో మాధవ గురుకులంలో ఉన్న నిరాశ్రిత పిల్లల మధ్య కేక్ కటింగ్ మరియు పిల్లలకు పండ్లు పంచి పెడుతూ పుట్టినరోజు వేడుకలు జరిపారు. యువనాయకులు నిత్యం పార్టీ బలోపేతం కోసం కృషి చేసే టి.సి వరుణ్ నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో జీవించాలని భవిష్యత్తులో రాజకీయాల్లో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని ఆ శ్రీ మధ్ ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులు ఆయనపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అని భైరవ ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ పుట్టిన రోజు వేడుకల్లో జన సేన పార్టీ ఐటి వింగ్ కోఆర్డినేటర్ పొరకాల రాజేంద్ర ప్రసాద్, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు లక్ష్మణ కుటాల, 34 వార్డ్ ఇంచార్జీ హరి బాబు, సీనియర్ నాయకులు వానిల్లి అంజిబాబు, అన్నం జయవర్ధన్, నరసింహులు, కార్తిక్, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.