దౌర్భాగ్య ముఖ్యమంత్రి పాలనలో ఉన్నాం: గురాన అయ్యలు

విజయనగరం: రాష్ట్రంలో ప్రజల మధ్యకు రాలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి పాలనలో మనమంతా వున్నామని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక, దుర్మార్గపు పాలన సాగుతోందని విమర్శించారు. అభద్రతా భావం తో సీఎం జగన్, మంత్రులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ నామస్మరణ వైసిపికి తారకమంత్రంలా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక స్థాయి దిగజార్చుకొని వ్యక్తిగత విమర్శలకు పాల్పడడం సిగ్గుచేటు అన్నారు. పవన్ కళ్యాణ్ పై జగన్‌ వ్యాఖ్యలు ఆయన అసహనానికి నిదర్శనమన్నారు. జగన్ గురించి, ఆయన కుటుంబం గురించి వ్యక్తిగత విమర్శలు చేస్తే తట్టుకోగలరా? అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో బాబాయి హత్యను కూడా రాజకీయ లబ్ధి కి వాడుకున్నారని.. ప్రాణ భయంతోనే తల్లి, చెల్లి రాష్ట్రాన్ని వదిలిపోయరన్నారు. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ వల్లనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేకపోయారా? అని జగన్ ని ప్రశ్నించారు.పవన్‌ను దత్తపుత్రుడు అంటే జనసైనికులు చెప్పులు తీసి కొడతారని హెచ్చరించారు. మీడియా సమావేశం ఏర్పాటు చేసి జర్నలిస్టుల ప్రశ్నలకు సమాదానం చెప్పలేని పిరికి మనిషి జగన్మోహన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. జగన్ సభల్లో కూడా మీడియా పై ఆంక్షలు విధించడం అమానుషమన్నారు.