జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ శిబిరాలకు అనూహ్యమైన స్పందన

🔸జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వనమోదు శిబిరాలకు ఊహించని స్పందన
🔸పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లటమే లక్ష్యంగా సభ్యత్వ శిబిరాల నిర్వహణ
🔸కార్యకర్తల సంక్షేమమే జనసేన లక్ష్యం
🔸జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు)

విజయనగరం, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు శిబిరాన్ని జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) విజయనగరం కోట వద్ద శుక్రవారం ఉదయం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ శిబిరాలకు ప్రజలనుంచి అనూహ్యమైన, ఊహించని స్పందన లభిస్తుందని, జనసేన పార్టీ సిద్ధాంతాలను,అధినేత ఆశయాలను ప్రజల్లోకి రీసుకెళ్లటమే లక్ష్యంగా జనసేన పార్టీ పనిచేస్తుందని,కార్యకర్తల సంక్షేమమే జనసేనలక్ష్యమని, భారత దేశంలో ఏ రాజకీయ పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం చూడట్లేదని,కేవలం జనసేన పార్టీ మాత్రమే కార్యకర్తల సంక్షేమం కోసం ఆలోచించి ఈ జీవితభీమా పధకాన్ని ప్రవేశపెట్టిందని, ఈఅవకాసాన్ని ప్రతీ జనసైను కులు, వీరమహిళలు,జనసేన, మెగాఫ్యామిలీ అభిమానులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ సభ్యత్వ నమోదు శిబిరంలో జనసేన పార్టీ యువనాయకులు చెల్లూరి ముత్యాల నాయుడు, సారికి విశ్వనాధ్, డాక్టర్ మురళీమోహన్, లోపింటి కళ్యాణ్, దాసరి యోగేష్, రాగోలు సాయి కిరణ్, వాసు, శ్రీను పాల్గొన్నారు.