సిద్ధారెడ్డిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ

చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, యాదమరి మండలం, సిద్ధారెడ్డిపల్లి గ్రామంలో మండల అధ్యక్షుడు కుమార్ ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు నియోజకవర్గం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కొత్తపల్లి శివప్రసాద్, చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, బంగారుపాళ్యం మండల ఉపాధ్యక్షులు, బాలసుబ్రమణ్యం, కాపు సంక్షేమ సేన యువత అధ్యక్షుడు ప్రభాకర్, మండల ఉపాధ్యక్షులు ఢిల్లీ సుల్తాన్, ప్రధాన కార్యదర్శులు వేముల పవన్, యువరాజ్ చంద్ర, మాధవ, మండల కార్యదర్శులు కరవాది శివా, కుమార్ రాజా, నూరుల్లా, భరణి, జనసైనికులు, వీర మహిళలు, గ్రామస్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నాయకులు అందరూ జనసేన పార్టీకి ఎప్పటికీ అండగా ఉంటామని పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఆయనకు మా మద్దతు ఉంటుందని తెలియజేశారు. అదేవిధంగా ఈ గ్రామంలో ఓటుకు నోటు నిషిద్ధం అనే నినాదాన్ని మరొకసారి అందుకున్నారు.