జనసేన పార్టీ ఆధ్వర్యంలో వైద్యుల దినోత్సవం

*జనసేవలో జనసైనికులు

*డాక్టర్స్ డే సందర్బంగా మరియు నాయకులు అదాడ మోహనరావు, చెల్లూరి ముత్యాల నాయుడు పుట్టినరోజు సందర్బంగా పలు సేవాకార్యక్రమాలు

విజయనగరం: జాతీయ వైద్యుల దినోత్సవం మరియు జనసేనపార్టీ సీనియర్ నాయకులు అదాడ మోహనరావు మరియు చెల్లూరి ముత్యాల నాయుడు పుట్టినరోజు పురస్కరించుకొని శుక్రవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) నిర్వహించారు.

ముందుగా పట్టణంలో అగ్నిమాపక కార్యాలయం ఎదురుగా ఉన్న రెడ్ క్రాస్ సంస్థ నడిపిస్తున్న పట్టణ నిరాశ్రుయుల భవనంలో వృద్దులకు అల్పాహారాన్ని అందించారు. అనంతరం కె. ఎల్. పురం, యాతపేట, ప్రాధమిక పాఠశాలలో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. పి.జి. స్టార్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.వి. రమణ స్థానిక ప్రజలకు స్వయంగా తనిఖీలు నిర్వహించి, బి.పి, షుగర్ పరీక్షలు నిర్వహించి, అవసరమైన రోగులకు మందులను ఇచ్చారు.

ఈ సందర్బంగా జనసేన నాయకులు అదాడ మోహనరావు మాట్లాడుతూ వైద్యులు ఆరాధ్యులు అని, డాక్టర్స్ విలువ ప్రపంచానికి అంతా తెలిసినా, కోవిడ్ విజ్రంబించి కరోనా విలయతతాండవం చేస్తున్న కాలంలో ప్రతీఒక్క మానవజాతికి ప్రపంచ వ్యాప్తంగా ఈ వైద్యలే ప్రత్యక్ష దైవాలుగా కనిపించి, వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడిన దేవుళ్ళు ఈ వైద్యులని కొనియాడారు.

పుట్టినరోజులు, వైద్యుల దినోత్సవం సందర్బంగా సేవాకార్యక్రమాలతో ప్రజలకు చేరువయ్యి, సేవచేయడం అభినందనీయమని జనసైనికులు అందరినీ అభినందించారు.

అనంతరం ప్రముఖ వైద్యులు ఎస్.వి.రమణ, డాక్టర్ ఎస్. మురళీమోహన్ మరియు డాక్టర్ రాజశేఖర్ కు జనసేన నాయకులు సత్కరించారు.

సుమారు మూడువందలమంది తనిఖీలు చేయించుకున్న ఈ శిబిరంలో జనసేన పార్టీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు డోల రాజేంద్ర ప్రసాద్, నాయకులు వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు, జనసేన పార్టీ యువనాయకులు లోపింటి కళ్యాణ్, కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, ఆనంద్, ముత్యాలరావు, రవి, రవికుమార్, చిన్ని, నాని, మధు, సాయికుమార్, దువ్వి రాము, బి రాజేష్, అప్పన్న, పత్రి సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.