కొత్తకోట గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

చిత్తూరు, ఆంధ్రరాష్ట్రంలోనే జనసేనపార్టీ మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో గల పార్టీ జెండా తరువాత అతిపెద్ద 55 అడుగుల ఎత్తున్న జెండాను చిత్తూరు జిల్లా, గుడిపాల మండలం, కొత్తకోట గ్రామంలో జనసేన నాయకులు రూప్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏర్పాటు చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పిఏసి సభ్యులు మైర్యు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా.పసుపులేటి హరి ప్రసాద్ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారాలు అందించిన జగదీష్, కిరణ్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా కార్యవర్గం, వివిధ నియోజకవర్గాల ఇంచార్జులు, గుడిపాల మండల కమిటీ సభ్యులు, వీర మహిళలు, జనసేన నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.