కుంకలగుంట గ్రామంలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

  • పల్లె పల్లెలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడుతుంది

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో గ్రామ అధ్యక్షులు, పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పార్టీ నూతన మూడు జెండాలను రాష్ట్ర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు చేతుల మీదగా ఆవిష్కరించడం జరిగినది.. జెండా ఆవిష్కరణ అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. గ్రామస్తులంతా కలిసి చాలా గొప్పగా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తూ ఇంత అఖండ స్వాగతాన్ని మాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు, నమస్కారం తెలియజేశారు. ఇదే ఉత్సాహంతో మనందరం రానున్న ఎలక్షన్లో పనిచేసి ఈ సత్తెనపల్లి నియోజకవర్గంలో నాకు పోటీ చేసే అవకాశం ఇచ్చినా లేదా ఇంకెవరికి అవకాశం ఇచ్చినా ఇదేవిధంగా ప్రతి ఊరు తిరుగుతూ, ప్రతి ఇంటికి వెళ్తూ ప్రచారం చేసి గెలిపిస్తానని అందరి సమక్షంలో మాటిస్తున్నానని తెలియజేశారు. గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఒక నిబద్ధతతో ముందుకు వెళ్లే పార్టీ ఈ రాష్ట్రంలో ఏదైనా ఉందంటే అది జనసేన పార్టీ మాత్రమే, జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధి, జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్ర ప్రజల మేలు, జనసేన పార్టీ లక్ష్యం ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు. జనసేన పార్టీ దోచుకోవడానికి దాచుకోవడానికి పుట్టిన పార్టీ కాదు అని తెలియజేశారు. మమ్మల్ని ఘనంగా ఆహ్వానించి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క జనసేన నాయకునికి, జనసైనికునికి మరియు వీరమహిళలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. సభ అనంతరం 2019 ఎన్నికల ప్రచారంలో కుంకలగుంట గ్రామంలో జరిగిన సభకి వస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన పార్టీ కార్యకర్త మట్టం అశోక్ కి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, వివిధ మండలాల గ్రామ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, గ్రామ పెద్దలు, నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.