తామరఖండిలో ఘనంగా జనసేన జెండా ఆవిష్కరణ

పార్వతీపురం నియోజకవర్గం, సీతానగరం మండలం నాయకులు జయశంకర్, సాయి కిరణ్ మరియు అచ్యుత నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించబడిన జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గౌరవ అతిథులుగా పాల్గొన్న సాలూరు జనసేన పార్టీ సమన్వయకర్త గేదెల ఋషి వర్ధన్, సీతానగరం పార్టీ నాయకులు ఐటి కో-ఆర్డినేటర్ పైల సత్యనారాయణ, సీతానగరం నాయకులు కల్యంపూడి సత్యనారాయణ, సీనియర్ నాయకులు చిప్పాడు సూర్యనారాయణ మరియు పార్వతీపురం మండల అధ్యక్షులు ఆగూరు శ్రీను, పార్వతీపురం నాయకులు విశ్వేశ్వరరావు, గౌరీ మరియు బలిజిపేట సీనియర్ నాయకులు స్వామినాయుడు, తెర్లం మండల అధ్యక్షులు రవి, బొబ్బిలి మండల అధ్యక్షులు గంగాధర్ మరియు కురుపాం మండల అధ్యక్షులు గౌరీ శంకర్, మక్కువ మండల నాయకులు రమేష్ లకు, ఈ కార్యక్రమానికి పిలవగానే హాజరై వచ్చిన పార్వతీపురం, బొబ్బిలి, సాలూరు నియోజకవర్గాల నుండి వచ్చిన పార్టీ సీనియర్ నాయకులకి జనసైనికులకి పేరుపేరునా తామరఖండి గ్రామం తరపున మరియు జనసేన పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.