టిడిపి నిరాహార దీక్షకు రెడ్డి అప్పల నాయుడు సంఘీభావం

ఏలూరు నియోజకవర్గం: సైకో జగన్ రెడ్డి పాలనకు పాడి కట్టి రాష్ట్రం నుంచి తరిమికొడతామని జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధికార ప్రతినిధి, ఏలూరు నియోజవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడుపై తప్పుడు కేసులు బనాయించి, జైల్లో పెట్టడాన్ని నిరసిస్తూ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు ఆదివారం ఏలూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ప్రదర్శన చేపల తూము సెంటర్లో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న దీక్షా శిబిరం వరకు జరిగింది. టిడిపి నాయకులకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి దశ, దిశలు అందించిన విజన్ కలిగిన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కుట్రపూరితంగా జైల్లో పెట్టిన సైకో జగన్ రెడ్డి ప్రభుత్వానికి చరమ గీతం పాడే రోజులు దగ్గరలో పడ్డాయన్నారు.. సైకో జగన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు.. కాబట్టి ప్రతిపక్ష నాయకులపై బురద జల్లుతూ అక్రమ కేసులు బనాయిస్తూ జైలుకు పంపుతున్నాడని ఆరోపించారు.. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగిస్తున్న బందిపోట్లు, మాఫియా, క్రిమినల్స్ ను జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసి తరిమి కొడతాయని స్పష్టం చేశారు. ఏలూరులో దుర్మార్గమైన చర్యలకు ఎమ్మెల్యే ఆళ్ళ నాని పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారని ధ్వజమెత్తారు.. అన్యాయాలు, అక్రమాలు జరిగినప్పుడు నిరసన వ్యక్తం చేస్తూ దీక్షలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ ఏలూరు వసంతమహాల్ సెంటర్లోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ దీక్షలు చేపడితే పోలీసులు చేత ఎమ్మెల్యే ఆళ్ల నాని భగ్నం చేయించడం దుర్మార్గమైన చర్యని దుయ్యబట్టారు. టిడిపి, జనసేన పార్టీలు ఏకమై గళం ఎత్తితే తన బండారం ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందోనని, అక్రమ సంపాదన బయటపడుతుందని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద దీక్షా శిభిరం ఏర్పాటుకు పోలీసులు చేత అనుమతి లేకుండా చేశారని ఎమ్మెల్యే ఆళ్ల నానిపై రెడ్డి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగున్నర సంవత్సరాలు మొద్దు నిద్రపోయిన ఎమ్మెల్యే నాని రెండు నెలల నుంచి పరుగులు పెడుతున్నారన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం ప్రజలకు స్వేచ్ఛగా జీవించే హక్కు లేదా అని ఎమ్మెల్యేని నిలదీశారు. అదిస్తాను, ఇది ఇస్తానని చెబుతున్న ఎమ్మెల్యే మాటలను ప్రజలు నమ్మడం లేదన్నారు. 2024లో ఎమ్మెల్యే ఆళ్ల నానిని ఓడించి ఏలూరు నియోజవర్గంలో జనసేన, టిడిపి జెండాలు రెపరెపలాడిస్తామని‌ చెప్పారు. రాష్ట్రంలో ఉన్న సైకో పాలనను అంతం చేస్తామని, చంగల్ గూడా జైల్లో జగన్ ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ సిరిపల్లి ప్రసాద్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు బీవీ రాఘవయ్య చౌదరి, ఏలూరు నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్, చేనేత కార్యదర్శి దోనేపూడి లోవరాజు, జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా మరియు పార్టీ నాయకులు కార్యకర్తలు వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.