44 పోస్టుల భర్తీకి UPSC నోటిఫికేషన్

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులపై అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఈ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన తేదీలు వంటి వివరాలు:

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఇంజినీర్, ఫోర్మాన్, సీనియర్ సైంటిస్ట్ అసిస్టెంట్, స్పెషలిస్ట్ గ్రేడ్

పోస్టుల సంఖ్య: 44

విద్యార్హత: ఈ పోస్టులకు అప్లై చేయాలి అనుకునే అభ్యర్థుల కనీస విద్యార్హత ఇంజినీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ. పోస్టులను బట్టి అర్హతలు నిర్ణయిస్తారు.

ఆసక్తికల అభ్యర్థులు upsc.gov.inలో అప్లై చేయవచ్చు. రిజిస్ట్రేషన్ చేయడానికి ముందు అభ్యర్థులు నోటిఫికేషన్ కాపీని సేవ్ చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: జనరల్, ఓబిసి, ఆర్థికంగా వెనకబడిన అభ్యర్థులకు- రూ. 25

ఇతర కేటగిరీ అభ్యర్థులు ఎలాంటి రుసుము చెల్లించే అవసరం లేదు.

ఆన్‌లైన్‌లో అప్లై చేయడానికి చివరి తేది: అక్టోబర్ 29, 2020

దరఖాస్తు సబ్మిట్ చేయడానికి చివరి తేదీ: అక్టోబర్ 30, 2020

పూర్తి వివరాలకు http://upsc.gov.in వెబ్‌సైట్‌ చూడొచ్చు.