అంగరంగ వైభవంగా ఊరూరా సంక్రాంతి – జనసేన రంగోలి పోటీలు

విజయనగరం: సంక్రాంతి పండుగ పురస్కరించుకొని
జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి ఆధ్వర్యంలో.. ఊరూరా సంక్రాంతి ~ జనసేన రంగోళి మొదటిరోజులో భాగంగా ఆదివారం కోరుకొండ గ్రామం మరియు కోరుకొండ పాలెం గ్రామలలో మండల నాయకులు బొబ్బాది చంద్ర నాయుడు సమక్షంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మహిళామణులు పాల్గొని రకరకాల రంగవల్లులు అలంకరించారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు మొదట, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేయడమే కాకుండా పోటీలో పాల్గొన ప్రతి ఒక్కరికి కన్సలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక మహిళలు గ్రామస్తులు నుండి అనూహ్య స్పందన లభించింది. మహిళామణులకు నూతన ఉత్సాహం అందించడమే కాకుండా గ్రామస్థాయిలో మన జనసేన పార్టీ ద్ధాంతాలను ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు, వీరమహిళలు జనసైనికులు గ్రామ ప్రజలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.