విద్యుత్ చార్జీలు తగ్గించాలని మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపిన వల్లూరు జనసేన

ఆచంట నియోజకవర్గం వల్లూరులో పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని జనసేన ఆధ్వర్యంలో భారతరత్న డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మోకాళ్లపై నిల్చుని నిరసన తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లాసెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యుత్ చార్జీలు పెంచి పేదవాళ్ల పై పెనుబారం మోపుతుందని, ఇప్పటికే కరోనా విపత్తువలన అన్ని వర్గాల ప్రజల ఆదాయాలపై పెనుబారం పడిందని, జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక నిత్యావసర సరుకుల ధరలన్నీ ఆకాశానికి అంటాయని, ఇప్పుడు మరలా విద్యుత్ చార్జీలు పెంచితే పేదవారు జీవించేది ఏలా అని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసిన పాపానికి రాష్ట్ర ప్రజలు ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలంటేనే భయపడేలా చేస్తున్నారని, కాబట్టి జగన్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహం వద్ద భారతరత్న అంబేద్కర్ గారి సాక్షిగా జనసేనపార్టీ ఆధ్వర్యంలో మోకాళ్లపై నిలబడి నిరసన తెలియచేశామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కడిమి శ్రీనివాస్ పాల్గొన్నారు.