జనసైనికుని కుటుంబానికి మనోధైర్యాన్నిచ్చిన వంపూరు గంగులయ్య

జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయితీ, తెరలమామిడి గ్రామంలో జనసైనికుడు సారె రవికుమార్ తల్లి సారె బాలమ్మి వ్యవసాయ పనులకు వెళ్తూ ప్రమాదవశాత్తు పడిపోయారు. తీవ్రగాయలై పాడేరు ఏరియా ఆస్పత్రికి తరలించిన వెంటనే ప్రమాద తీవ్రత ఎక్కువకావడంతో విశాఖపట్నం కేంద్ర వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న అరకు-పాడేరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి వంపురు గంగులయ్య ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని పరామర్శించి, ధైర్యం చెప్పారు. జనసైనికులకు ఏ కష్టం వచ్చినా వెంటే వుండే డాక్టర్ గంగులయ్యకి సారె రవికుమార్ అతని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇంచార్జ్ తో జనసైనికులు పాల్గోన్నారు