తడలో మన ఇల్లు – మన జనసేన

సూళ్లూరుపేట, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసే దిశగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ప్రతి కుటుంబాన్ని కలిసే విధంగా సూళ్లూరుపేట నియోజకవర్గ జనసేన యువనేత రోసనూరు సోమశేఖర్ రూపొందించిన “మన ఇల్లు – మన జనసేన” కార్యక్రమం గురించి ఆదివారం తడ మండల జనసైనికులను కలిసి ప్రణాళిక వివరించారు, తదుపరి కరపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తడ మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షులు సిరివేటి రమణ, ప్రధాన కార్యదర్శి దిలీప్ కుమార్ మరియు స్థానిక జనసైనికులు పాల్గొన్నారు.