మున్సిపల్ కార్మికుల సమ్మెకు వరికూటి నాగరాజు మద్దతు

దర్శి నియోజకవర్గం: దర్శి నగర పంచాయతీ వద్ద గత వారం రోజుల నుంచి మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెకు దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు వరికూటి నాగరాజు మద్దతుగా సంఘీభావం తెలియజేసి అనంతరం పారిశుద్ధ్య కార్మికులకి భోజనం ఏర్పాటు చేసి వారితో కలిసి భోజనం చేసారు. ఈ కార్యక్రమంలో దర్శి జనసేన నాయకులు షేక్ ఇర్షద్, పాశం వెంకటేష్, నీలి శెట్టి ప్రభు, ఓబులాపురం ఏడుకొండలు, బండారు సుబ్బారావు, నీలిశెట్టి ఏడుకొండలు, పసుపులేటి శీను, శివశంకర్, కోటి, నాగిశెట్టి అజయ్ కుమార్ జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.