పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించిన వీరమహిళ దొండ కుసుమ నాయుడు

విశాఖ జిల్లా, శుక్రవారం విశాఖపట్నం నగరంలో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి స్త్రీ, పురుషుల సీనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ – 2021 పోటీలలో దొండ కుసుమ నాయుడు ఇంటర్నేషనల్ పవర్ లిఫ్టర్ పాల్గొనడం జరిగింది. అందులో మహిళల 57 కేజీల విభాగంలో విశాఖ జిల్లా నుండి పోటీపడి సక్సెస్ ఫుల్ గా కాంపిటీషన్ లో పూర్తి చేసి దొండ కుసుమ నాయుడు ఫస్ట్ ప్లేస్ గోల్డ్ మెడల్ సాధించారు. ఈ సందర్భంగా దొండ కుసుమ నాయుడు మాట్లాడుతూ తనకి సహకరించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు.