అక్రమ అరెస్టులను ఖండించిన రాజోలు జనసేన

అక్రమ అరెస్టులతో జనసేన పార్టీ ప్రజా ఉద్యమాలను ఆపలేరు…!!
టీటీడీ కాంట్రాక్టు కార్మికుల పై ప్రభుత్వం తన మొండి వైఖరి వీడాలి.
టీటీడీ పాలకమండలి వ్యాహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల వలన వేల మంది బతుకులు రోడ్డున పడ్డాయి.

తిరుమల తిరుపతి దేవస్థానన్ని వేదికగా చేసుకుని సాక్షాత్ ఆ శ్రీవేంకటేశుని సమక్షంలో కార్మికుల బతుకులు రోడ్డున పడేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం, ఇంత జరుగుతున్న చోద్యం చూస్తున్న ప్రతిపక్షం (టీడీపీ) ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, టీటీడీ కాంట్రాక్టు కార్మికులకు అండగా నిలబడిన జనసేన పార్టీ నాయకులను అక్రమంగా అరెస్టులు చేసి తప్పుడు కేసులు పెట్టి ప్రజా గొంతుక నొక్కే ప్రయత్నంలో భాగంగా కార్మికులకు వారి కుటుంబాలకు మద్దతుగా నిలిచిన జనసేన పార్టీ నాయకులు శ్రీ మనోహర్ దేవర మరియు జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ పసుపులేటి హరిప్రసాద్ మరియు కార్మికులను పోలీసు లాఠీలు జూలిపించి మరి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ దేవర మాట్లాడుతూ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని శాంతి యుతంగా దీక్ష చేస్తున్న వారిని ప్రత్యేక పోలీసు బలగాలతో అక్రమంగా అరెస్టు చేయడం తప్పుడు కేసులు నమోదు చేయడం హేయమైన చర్య అని అన్నారు మరియు ప్రభుత్వం తక్షణమే కార్మికులకు న్యాయం చేయాలని లేకపోతే భారీ మూల్యం చెలించుకోవాలి అని ప్రభుత్వాన్ని హెచ్చరించారు, ఇది అప్రజాస్వామికం మరియు హక్కులను కాలరాయడం అని తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజక వర్గం జనసేన పార్టీ బి సావరం వైస్ ప్రెసిడెంట్ శ్రీ రావూరి నాగబాబు, జనసేన నాయకులు శ్రీ రేకపల్లి సురేష్ బాబు, మలికిపురం మండల ఎంపీపీ శ్రీమతి మేడిచేర్ల సత్యవాణి రాము. రాజోలు వైస్ ఎంపీపీ ఇంటిపల్లి ఆనందారాజు, శ్రీ బోనం సాయి, ఎంపీటీసీలు భైరా నాగరాజు, దార్ల కుమారి చినబాబు, రాజోలు లీగల్ సెల్ శ్రీ జాలెం శ్రీనివాస్, గుళ్లింక బ్రహ్మానందం, గంగాధర్, బీజేపీ నాయకులు కటికిరెడ్డి గంగాధర్, కుంచె శ్రీనివాస్(పండు) జనసేన సేవాదళ్ రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు జనసైనికులు, వీర మహిళలు తదతరులు తీవ్రంగా ఖండించారు.