రైల్వే అండర్ పాస్ నిర్మాణానికై జనసేన పోరాటానికి విజయం

ఇచ్చాపురం నియోజకవర్గం: జనసేన దీక్ష ఫలించిన రోజు ఈ రోజు. ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఇచ్చాపురం నుండి కొలిగాంకి వెళ్లే రహదారిలో రైల్వే అండర్ పాస్ కోసం గతంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసిన విషయం అందరికీ విదితమే. ఈ విషయంలో కుర్డ డివిజన్ డిఆర్ఎం ఇచ్చిన మాట ప్రకారం బుధవారం ఇచ్చాపురం ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో చేరుకొని అండర్ పర్సెంట్ నిర్మాణం కోసం జనసేన చేపట్టిన ఉద్యమానికి సానుకూలంగా స్పందించడం జరిగినది. ఈ విషయంపై స్పందించిన డి.ఆర్.ఎం రింకేష్ రాయ్ మాట్లాడుతూ ఇది జనసేన విజయంగా నేను భావిస్తున్నానని, జనసేన పార్టీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.