విజయవాడ నగర వీరమహిళ ఆత్మీయ సమావేశం

విజయవాడ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సూచనల మేరకు కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ ఆధ్వర్యంలో ఉమ్మడి కృష్ణ జిల్లా విజయవాడ నగర వీరమహిళ ఆత్మీయ సమావేశం సోమవారం తేదీ తూర్పు నియోజకవర్గంలోని మీటింగ్ హబ్ హాలులో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్, రాష్ట్ర కార్యదర్శి అమ్మిశెట్టి వాసు, కృష్ణ పెన్నా కమిటీ సభ్యులు రావి సౌజన్య, కోలా విజయలక్ష్మి, కురిమేళ్ల లక్ష్మీ సరస్వతి, మల్లెపు విజయలక్ష్మి జిల్లాలోని వీర మహిళలు బొందుల శ్రీదేవి, రెడ్డి మణి హాజరయ్యారు. ఈ సదస్సుకు విజయవాడ నగర కమిటీ మహిళా సభ్యులు, ధార్మిక మండలి సభ్యులు, మహిళా డివిజన్ అధ్యక్షులు లందరూ హాజరై విజయవాడ నగర వీర మహిళా ఆత్మీయ సమావేశాన్ని విజయవంతం చేశారు.