ధనలక్ష్మిని పరామర్శించిన వినుత కోటా

శ్రీకాళహస్తి, పట్టణంలో హోటల్ నడుపుతున్న యజమాని భార్య ధనలక్ష్మిపై శ్రీకాళహస్తి పట్టణ 1టౌన్ సిఐ దురుసుగా ప్రవర్తించిన తీరు బాధాకరం. తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భాదితురాలు ధనలక్ష్మిని పరామర్శించిన శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా. ఒక మహిళపై ఇలా ప్రవర్తించడాన్ని తీవ్రంగా జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నామని తెలిపారు. తప్పు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి దురుసు ప్రవర్తన మంచిది కాదని తెలిపారు. ఈ సంఘటన వెనక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపారు. గతంలో కూడా ఎమ్మెల్యే ప్రోద్భలంతో మాపై అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెట్టారని. ఎమ్మెల్యే కనుసన్నల్లోనే ఏ విషయం అయిన పోలీస్ స్టేషన్ లో జరుగుతున్న తరుణంలో ఒక వైసిపి కార్యకర్తపై ఆమె అలా ప్రవర్తించడంపైన అనేక విషయాలు మా దృష్టికి వస్తున్నాయని తెలిపారు. బాధితులు వైసిపి కార్యకర్తలు అయినా కానీ స్థానిక ఎమ్మెల్యే ఇంత వరకు స్పందించక పోవడంపై తప్పకుండా ఆలోచించాల్సిన విషయమే. గత కొంత కాలంగా ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలకు సహకరించడం లేదనే నెపంతో ఆమెను టార్గెట్ చేస్తూ ఇలా చేయించి, ఇరికించారని పలువురు తెలుపుతున్నారు. పోలీసులు ఎమ్మెల్యేలు చెప్పినట్టు కాకుండా చట్టాన్ని పాటిస్తూ ప్రజల పట్ల వ్యవహరించాలని, ఎవరు ఒత్తిడి తెచ్చినా చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇలా దురుసుగా ప్రవర్తించడం తగదని, శ్రీకాళహస్తి డియస్పి, తిరుపతి ఎస్పీ విచారణ చేసి దురుసు ప్రవర్తన చేసిన పోలీస్ అధికారిపై తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాలురు ముని కుమార్, త్యాగరాజు, భాగ్యలక్ష్మి, ఉమామహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.