మానవత్వంతో రోడ్ల మధ్య ఉన్న ప్రమాదకర గుంతలను పూడ్చిన విశాఖ పశ్చిమ జనసేన

విశాఖ పశ్చిమ నియోజకవర్గం, పారిశ్రామిక ప్రాంతం, మల్కాపురం పి.ఎస్ పరిధిలో, విశాఖ పశ్చిమ జనసేన యువ నాయకుడు ధర్మేంద్ర ఆధ్వర్యంలో రవాణా రోడ్ల మధ్య ఉన్న ప్రమాదకర గుంతలను పూడ్చటం జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ పశ్చిమ నియోజకవర్గ శ్రేణులు శ్రీకాంత్, నగేష్, శంకర్, ప్రేమ్ , వంశీ, సంతోష్, లక్ష్మణ, గణేష్, సాయినాథ్, శశిధర్ పాల్గొన్నారు. ఈ విధంగా అయిన నిద్రపోతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మేలుకొని రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల గుంతలని పూడ్చాలని కోరుకుంటున్నామని తెలిపారు..