వంతాడపల్లి పంచాయతీలో జనసేన నాయకుల పర్యటన

పాడేరు నియోజకవర్గం: వంతాడపల్లి పంచాయతీలో శుక్రవారం జనసేన నాయకులు కిల్లో రాజన్, నందొలీ మురళీకృష్ణ, సి.హెచ్.అనిల్ కుమార్, సుర్ల సుమన్ పర్యటించారు. వివరాల్లోకి వెళ్తే జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆదేశాలు మేరకు, లీగల్ ఎడ్వటైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ.. ఆదివాసీ హక్కులు గిరిజన చట్టాలను కాలసరుస్తున్న ఈ బుర్జ రాజకీయ పార్టీలను తరిమికొట్టాలని కోరారు. ఆదివాసీ గిరిజన అస్తిస్త్వం కోసం గిరిజన జాతిని అణగ తొక్కుతున్న ఈ రాజకీయ నాయకుల నుండి మన చట్టాలను కాపాడుకోవలసిన బాధ్యత ఎంతైనా ఉంది అని వివరించారు.. అలాగే యువతకి జనసేన పార్టీ సిద్దాంతం వివరించి యువత మార్పుకి శ్రీకారం చుట్టాలని కోరారు. అలాగే జనసేన పార్టీ మండల అద్యక్షులు నందోలి మురళీకృష్ణ మాట్లాడుతూ గ్రామంలో అనేక సమస్యలు పరిష్కారం చేసే దిశగా జనసేన పార్టీ అధికారం లోకి వస్తేనే అది సాధ్యమని అన్నారు. అలాగే గ్రామం అభివృద్ధి జరగాలంటే మన కష్టాలు పోవాలంటే కష్టాలు తెలిసిన పార్టీ జనసేన పార్టీ అని, ప్రతి ఒక్కరూ కృషి చేసి జనసేన పార్టీ గెలుపునకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు. అలాగే జనసేన పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు చైతన్యవంతులు గా తీర్చిదిద్ది, మన పిల్లల భవిష్యత్తు మెరుగు పడాలంటే, మన కష్టాలు పోవాలంటే, జనసేన పార్టీ అదికారంలోకి రావాలని, అన్నారు.. ఇన్ని ప్రభుత్వాలు మరినప్పటి నుండి ఇప్పటి వరకు అబివృద్దికి నోచుకోని గ్రామాలు ఉన్నాయి అని, అలాగే ఈ వైసిపి ప్రభుత్వం పంచాయితీ నిధులు దారి మళ్లించి ప్రజల్ని సంక్షేమ పథకాలు పేరుతో మోసం చేస్తూ ఒక చేత్తో ఇచ్చి, మరో చేత్తో, ప్రజలకు నిత్య సరుకుల రూపంలో, ప్రతి ఒక్కరి అత్యధిక రేట్లు పెంచేసి ప్రజల మీద భారం వేస్తున్నారు అని,గిరిజన బ్రతుకులు మారాలంటే మన గిరిజన చట్టాలు హక్కులు మీద అవగాహన కలిగిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇంఛార్జ్ డా!! వంపూరు గాంగులయ్య ని గెలిపించి మన నియోజక వర్గం నుండి, మండలం వరకు మండల నుండి గ్రామం వరకు అభివృద్ధి పరంగా ముందు అడగువేయలని, తెలిపారు… సుమన్ మాట్లాడుతూ, జనసేన పార్టీ సిద్ధాంతాలు మేనిఫెస్టో తెలియజేయడం జరిగింది.. గిరిజన నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు రావాలంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ ఎడ్వటైజర్ కిల్లో రాజన్, జనసేన పార్టీ పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళికృష్ణ, జనసేన పార్టీ కాకినాడ రూరల్ ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ పాడేరు మండల నాయకులు, సుమన్, నాగేంద్ర, రామకృష్ణ, సూర్యం, అశోక్, శివకుమార్, గౌరీశంకర్, ఈశ్వర్రావు, లోవరాజు, సింహాద్రి, చిన్నారావు, జానకిరావు, విశ్వకళ్యాణ్, వెంకట్రాజు, శివ లింగం,మధు, రాజారావు, అనిల్, బి. అనిల్ కుమార్, ఆనంద్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.