చీరాల నగర్ 1లో జగనన్న కాలనీల సందర్శన

చీరాల నియోజకవర్గం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ సూచనలతో శనివారం చీరాల నియోజకవర్గం చీరాల నగర్ 1 లో పేద ప్రజలకు ఇచ్చిన జగనన్న ఇళ్లను జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా చేనేత విభాగ అధ్యక్షులు కర్ణ కిరణ్ తేజ్, చేనేత విభాగ ఉపాధ్యక్షులు పింజల సంతోష్, బత్తిన బాలాజీ, కాగడాల శివ కుమార్, గొర్ల రఘురాం, బుద్ది శ్రీహర్ష, కొండకావూరి సిద్దు, చుండూరు మల్లికార్జున్, కె నిఖిలేష్ కుమార్, కె. రాము, వాసుదేవరావ్, పూర్ణ, దినేష్, శంకర్, శివ శంకర్లతో కలిసి సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పేదలు నివసించాలి అనుకుంటున్న ఈ కాలనీలలో కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో ఉంటూ ఈ ప్రభుత్వం విఫలమైందని, ఇక్కడున్న పరిస్థితిని చూస్తే అర్థమవుతుందనీ, వీటిని మంచి మౌలిక సదుపాయాలతో తొందరగా పూర్తిచేసి పేద ప్రజలకు ఇవ్వవలసిందిగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాబోవు రోజుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం మేరకు ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నాం అని తెలియజేసారు.