RIMS ‌లో 41 పోస్టుల భర్తీకి వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు

ఆదిలాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) వైద్యకళాశాలలో వేర్వేరు విభాగాలకు చెందిన 41 వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, సోషల్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌, జనరల్‌ మెడిసిన్‌, టీబీ, డీవీఎల్‌, సైకియాట్రీ, పిడియాట్రిక్స్‌, జనరల్‌ సర్జరీ, ఆర్థోపెడిక్స్‌, ఈఎన్‌టీ, గైనకాలజీ, రేడియో డయోగ్నొసిస్‌, అనిస్థీషియా, ఎపిడిమియాలజిస్ట్‌ తదితర విభాగాల్లో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఈ పోస్టులకు సెప్టెంబ‌రు 22న ఉదయం 10.30 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నేరుగా వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు హాజరుకావచ్చు.